Minister KTR : హైదరాబాద్ – ఒకప్పుడు ఎట్లుండె తెలంగాణ. ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ చూడాలని అన్నారు మంత్రి కేటీఆర్. గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. రైతులను రాజులను చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు విజన్ లేదని , కానీ దేశంలోనే అత్యంత దార్శనికత కలిగిన ఏకైక నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ అని స్పష్టం చేశారు.
Minister KTR Praises KCR
ఆయన ముందు నిల్చుని మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికీ లేదని పేర్కొన్నారు. ఎవరైనా సరే తల వంచి తీరాల్సిందేనని పేర్కొన్నారు. ఇవాళ అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా సంక్షేమ పథకాలు , కార్యక్రమాలను అమలు చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఆగమాగమైన తెలంగాణను ఇవాళ అభివృద్దికి నమూనాగా మార్చిన చరిత్ర తమదేనని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్(Minister KTR). ఎవరు ఏమిటో ప్రజలకు బాగా తెలుసన్నారు. తమకు కనీసం 80 సీట్లకు పైగా వస్తాయని , తిరిగి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తమను ఎదుర్కొనే సత్తా , దమ్ము ప్రతిపక్షాలకు లేదన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు అవగాహన ఉండదన్నారు. విషయాన్ని నేర్చుకునే ఓపిక కూడా వారికి లేకుండా పోవడం బాధాకరమన్నారు కేటీఆర్.
Also Read : Eatala Rajender : ఓటమి భయంతో పారి పోయిండు