CM KCR : తెలంగాణ అభివృద్దికి చిరునామా
సీఎం కేసీఆర్ ఆదిలాబాద్ సభలో
CM KCR : ఆదిలాబాద్ జిల్లా – అభివృద్దికి చిరునామా తెలంగాణ రాష్ట్రమని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. త్వరలోనే చనకా కొరటా ప్రాజెక్టు పూర్తి కావస్తుందన్నారు.
CM KCR Saya his Ruling
బోథ్ నియోజకవర్గం పరిధిలోని తిప్పల్ కోటి రిజర్వాయర్‌కు పెన్ గంగా నీళ్లు తీసుకొస్తే చాలా లాభం జరుగుతుందన్నారు. ఆ పని తప్పకుండా చేయిస్తానని అన్నారు కేసీఆర్(CM KCR). అనిల్ జాదవ్‌ను గెలిపిస్తే నెల రోజుల్లోనే బోథ్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తానని హామీ ఇచ్చారు.
డిగ్రీ కాలేజీ కావాలని కోరారని దానిని కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాంతంలో హార్టి కల్చర్ తో పాటు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం. ఇప్పటికే గిరిజనులకు పోడు భూములు ఇచ్చామన్నారు.
గిరిజనేతరుల వద్ద భూములు చాలా ఉన్నాయని, వాటిని తీసుకోవాలని కోరితే కేంద్ర సర్కార్ అడ్డు పడిందని ఆరోపించారు కేసీఆర్. వచ్చే సారి కేంద్రంతో పోరాడుతానని , మీకు కావాల్సింది తప్పకుండా తీసుకు వస్తానని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు కేసీఆర్.
Also Read : Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.59 కోట్లు