హైదరాబాద్ – ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కీలక అంశాలపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అభయ హస్తం పేరుతో మేని ఫెస్టోను రిలీజ్ చేసింది. ప్రత్యేకించి నిరుద్యోగులకు ఖుష్ కబర్ చెప్పింది. కేవలం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే మెగా డీఎస్సీని నిర్వహిస్తామని ప్రకటించింది. అంతే కాకుండా ఖాళీగా ఉన్న 2 లక్షల జాబ్స్ భర్తీకి సంబంధించి వార్షిక జాబ్ క్యాలెండర్ ను ముందే వెల్లడించింది.
మొత్తం ఈ మేని ఫెస్టో 42 పేజీలు ఉంది. ఇందులో ప్రధానంగా 62 అంశాలను చేర్చారు. రైతులకు ఉచితంగా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించింది పార్టీ. కాళేశ్వరం ముంపు బాధితులకు సాయం. ముంపు నివారణకు కరకట్టలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి జూన్ 1 దాకా గ్రూప్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించింది.
ప్రతి రోజూ సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ ఏర్పాటు . రైతులకు 2 లక్షల రుణ మాఫీ, 2 లక్షల దాకా వడ్డీ లేని రుణాలు అందజేస్తామని తెలిపింది . విత్తనాలు, ట్రాక్టర్లు, ఎరువుల కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 18 ఏళ్లు ఆ పై ఉన్న విద్యార్థినికి స్కూటీ, యూత్ కమిషన్ , ఈబీసీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపింది. రూ. 10 లక్షల వడ్డీ లేని రుణం యూత్ కు . జూన్ 2న నోటిఫికేషన్ జారీ చేస్తామని సెప్టెంబర్ 17 లోపు జాబ్స్ భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4 వేల భృతి, రైతులు, కౌలు రైతులకు ఏడాదికి రూ. 15 వేలు సాయం. రైతు కూలీలకు రూ. 12 వేలు, అన్ని పంటలకు మద్దతు ధర కల్పిస్తామని తెలిపింది. ధరణి పోర్టల్ రద్దు, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ. 10 వేల వేతనం పెంచుతున్నట్లు స్పష్టం చేసింది.