Eatala Rajender : కేసీఆర్ దొరను సాగనంపాలి
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
Eatala Rajender : హైదరాబాద్ – మాజీ మంత్రి , హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. ఎన్నికల ప్రచారంలో ఎల్బీ నగర్ లో సామ రంగారెడ్డికి మద్దతుగా ప్రసంగించారు ఈటల రాజేందర్(Eatala Rajender). ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించిన తర్వాత తొలి సభ ఎల్బీ స్టేడియంలో జరిగిందని గుర్తు చేశారు. ఆ తర్వాత మోదీ ప్రధాని అయ్యారని, మళ్లీ ఇదే గడ్డ మీద మోదీ బీసీని సీఎం చేస్తానని డిక్లేర్ చేశారని చెప్పారు.
Eatala Rajender Comments on KCR
తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి దాకా ఒటమి అన్నది ఎరుగ లేదన్నారు. ఇప్పటి వరకు ప్రజల ఆశీర్వాద బలంతో గెలుస్తూ వచ్చానని ప్రకటించారు. సామ రంగన్నకు ఓటు వేస్తే తనకు వేసినట్టేనని స్పష్టం చేశారు ఈటల రాజేందర్.
కేసీఆర్ పాలన పూర్తిగా అక్రమాలకు అడ్డాగా మారిందన్నారు. షీ టీమ్స్ , సీసీ కెమెరాల నిఘా ఉన్నా ఫాయిదా లేకుండా పోయిందన్నారు . ముక్కు పచ్చ లారని ఆడ బిడ్డ మీద అత్యాచారం జరిగితే స్పందనే లేదన్నారు. ఎల్బీ నగర్ పోలీస్ ఠాణా పరిధిలో పోలీసులే మహిళ మీద దౌర్జన్యం చేశారని , రక్షించాల్సిన వారే చెప్పకూడని చోట దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ఈటల రాజేందర్.
Also Read : Nadendla Manohar : భూ సేకరణ పేరుతో వేల కోట్ల దందా