AP Liquor Rates Hike : ఏపీలో మ‌ద్యం ధ‌ర‌ల‌కు రెక్క‌లు

భారీగా పెంచేసిన జ‌గ‌న్ స‌ర్కార్

AP Liquor Rates Hike : అమ‌రావ‌తి – మ‌ద్యం బాబుల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఏపీలో కొలువు తీరిన వైసీపీ(YCP) స‌ర్కార్. ఉన్న‌ట్టుండి మ‌ద్య ధ‌ర‌లు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఎక్సైజ్ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వులు వెంట‌నే అమ‌లులోకి వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేసింది.

AP Liquor Rates Hike Viral

ఇక మ‌ద్యం బాటిల్స్ కు సంబంధించి క్వార్ట‌ర్ బాటిల్ పై రూ. 10, ఫుల్ బాటిల్ పై రూ. 20 పెంచిన‌ట్లు తెలిపింది. అంతే కాకుండా ఫారిన్ లిక్క‌ర్ ధ‌ర‌లు రూ. 20 శాతం పెంచిన‌ట్లు తెలిపింది స‌ర్కార్. రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను రూపాయ‌ల నుంచి శాతాల్లోకి మార్చింది.

ఏఆర్ఈటీ శ్లాబులు రూపాయ‌ల‌లో ఉండ‌డంతో అన్ని బ్రాండ్ల‌పై సమానంగా ప‌న్నులు ఉండ‌డం లేద‌ని పేర్కొంది. అన్నీ ఒకేలా ఉండ‌టం కోసం నిర్ణీత ధ‌ర నుంచి ఏఆర్ఈటీని శాతాల్లోకి మార్చిన‌ట్లు ఎక్సైజ్ శాఖ స్ప‌ష్టం చేసింది.

ఇక ఐఎంఎఫ్ఎల్‌ కనీస ధర రూ.2,500లోపు ఉంటే దానిపై 250 శాతం, రూ.2,500 దాటితే 150 శాతం పెంచుతున్న‌ట్లు వెల్ల‌డించింది. బీరుపై 225 శాతం, వైన్ పై 200 శాతం పెంచిన‌ట్లు తెలిపింది. ఫారిన్ లిక్క‌ర్ పై 75 శాతం ఏఆర్ఈటీ పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ఒక ఫుల్ బాటిల్ ప్ర‌స్తుతం రూ. 570 ఉంటే దాని ధ‌ర రూ. 590 కి పెంచిన‌ట్లు తెలిపింది స‌ర్కార్.

Also Read : Sara Tendulkar : సారా టెండూల్క‌ర్ వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!