Padmavathi Utsavam : ఘ‌నంగా ప‌ద్మావ‌తి బ్ర‌హ్మోత్స‌వాలు

అమ్మ వారికి టీటీడీ చైర్మ‌న్ సారె స‌మ‌ర్ప‌ణ

Padmavathi Utsavam : తిరుమ‌ల – శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ పద్మావతి అమ్మ వారికి సారె స‌మ‌ర్పించారు టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి. రూ. 2.5 కోట్లు విలువైన 5 కిలోల బంగారు కాసుల మాల, యజ్ఞోపవీతం సమర్పించారు. అమ్మ వారి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగాయి. ఇవాళ చివ‌రి రోజు. ఉత్స‌వాల‌లో భాగంగా శనివారం పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె స‌మ‌ర్పించారు టీటీడీ చైర్మ‌న్.

Padmavathi Utsavam Updates

ప్రతి ఏటా పంచమి తీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా తిరుమలలో భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సారె ఊరేగింపుగా కాలి నడకన తిరుపతిలోని అలిపిరి, కోమలమ్మ సత్రం, తిరుచానూరు పసుపు మండపం మీదగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుంటుందని చెప్పారు.

తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు పద్మ సరోవరంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని టీటీడీ(TTD) నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో అద్భుతంగా నిర్వహిస్తోందని చెప్పారు.

ఈవో ఏవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయం నుండి రూ.2.5 కోట్లు విలువైన 5 కిలోల బరువు గల బంగారు కాసులమాల, యజ్ఞోపవీతం అమ్మవారికి కానుకగా సమర్పిస్తున్నట్టు తెలిపారు. ఆభ‌ర‌ణాలతో కూడిన శ్రీ‌వారి సారెను జెఈవో వీరబ్రహ్మంకు అంద జేశారు.

Also Read : Tirumala Rush : తిరుమ‌ల‌లో భ‌క్త జ‌న సందోహం

Leave A Reply

Your Email Id will not be published!