TPTF Support : బీఆర్ఎస్ కు ప్రైవేట్ టీచ‌ర్స్ ఫోరం స‌పోర్ట్

మంత్రి కేటీఆర్ ను క‌లిసిన నేత‌లు

TPTF Support : హైద‌రాబాద్ – రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ ఆయా సంఘాలు, వివిధ పార్టీల‌కు చెందిన నేత‌లు సంపూర్ణ మ‌ద్ద‌తును ప్ర‌క‌టిస్తున్నాయి. సోమ‌వారం తెలంగాణ ప్రైవేట్ టీచ‌ర్స్ ఫోరం (టీపీటీఎఫ్) ఫోరం ఆధ్వ‌ర్యంలో మంత్రి కేటీఆర్(Minister KTR) ను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

TPTF Support Viral

దీనికి సానుకూలంగా స్పందించారు మంత్రి. ఈ మేర‌కు తాము అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని, ఇక మీరు నిశ్చింత‌గా ఉండొచ్చ‌ని వారికి హామీ ఇచ్చారు. ఇదే విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా టీపీటీఎఫ్ నాయ‌కులు వెల్ల‌డించారు. త‌మ ప‌ట్ల సానుకూలంగా వ్య‌వ‌హ‌రించినందుకు తాము ఐటీ, పుర‌పాలిక‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో 2 లక్ష‌ల‌కు పైగా ఖాళీలు ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పోస్టు ఎందుకు భ‌ర్తీ చేయ‌డం లేదంటూ ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నించాయి. ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే బీఆర్ఎస్ ను నిల‌దీశాయి. మ‌రో వైపు కాంట్రాక్టు ప‌ద్ద‌తిన‌, ఔట్ సోర్సింగ్ ప‌ద్ద‌తిన వేలాది మంది కొన్నేళ్లుగా వెట్టి చాకిరి చేస్తున్నారు. వారి గురించి కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించు కోలేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

విచిత్రం ఏమిటంటే 40 ల‌క్ష‌ల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నా వారి గురించి బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చ‌క పోవ‌డం దారుణం.

Also Read : G Kishan Reddy : కేసీఆర్ స‌ర్కార్ అవినీతిపై విచార‌ణ

Leave A Reply

Your Email Id will not be published!