Ambati Ram Babu : వచ్చింది బెయిలే నిర్దోషి కాదు
చంద్రబాబు కోర్టు తీర్పుపై అంబటి
Ambati Ram Babu : అమరావతి – ఏపీ స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. టీడీపీ చీఫ్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు అనారోగ్యం కారణంగా మంజూరు చేసింది. ఇదే కేసులో భాగంగా సోమవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. రెగ్యులర్ గా చంద్రబాబు నాయుడుపై బెయిల్ మంజూరు చేసింది.
Ambati Ram Babu Comments about Chandrababu Bail
ఈ మొత్తం వ్యవహారంపై సోమవారం ట్వీట్టర్ వేదికగా స్పందించారు ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు(Ambati Ram Babu). ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. బాబుకు వచ్చింది బెయిల్ మాత్రమేనని ఆయనను నిర్దోషి అని ప్రకటించ లేదన్న విషయం గుర్తించాలని పేర్కొన్నారు మంత్రి.
కోర్టు ఇచ్చిన తీర్పును శిరసా వహించాల్సిన టీడీపీ శ్రేణులు తమ పార్టీపై, ప్రభుత్వాన్ని, ఏపీ సీఎం జగన్ రెడ్డిని, మంత్రులను అకారణంగా దూషించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. ఇలాగే వ్యవహరిస్తూ పోతే తగిన మూల్యం చెల్లించక తప్పదంటూ హెచ్చరించారు.
ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడిపై ఇప్పటి వరకు ఏపీ సీఐడీ 8 కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం ఏపీ స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి మాత్రమే రెగ్యులర్ బెయిల్ మంజూరైంది.
ఇదే కేసుకు సంబంధించి హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Also Read : Local Boy Nani Arrest : యూట్యూబర్ నాని అరెస్ట్