AP CM YS Jagan : రాష్ట్ర విభజన జగన్ ఆవేదన
భారీగా నష్టం చేకూరిందన్న సీఎం
AP CM YS Jagan : అమరావతి- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడే బాగుండేదని, విడి పోవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. విచిత్రం ఏమిటంటే రాష్ట్రం విడి పోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినా ఇంకా దానిపై బురద జల్లడం దారుణం.
AP CM YS Jagan Shocking Comments
రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన నిధులను విడుదల చేయకుండా కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందని పేర్కొన్నారు. విశాఖపట్నం వయా ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా కడపకు అత్యంత వేగంగా నడిచే రైళ్ల కోసం ఒత్తిడి తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఎం.
రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్ లో అంశాల పురోగతిపై చర్చ జరగాలని సూచించారు . సమావేశంలో ప్రస్తావనకు రానున్న అంశాలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష చేపట్టారు. పదేళ్లయినా ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు జగన్ రెడ్డి(AP CM YS Jagan). అప్పుల్లో 58 శాతం ఏపీకి 42 శాతం తెలంగాణకు కేటాయించారని తెలిపారు.
పరిస్థితులు ఇలాగే ఉంటే ఆదాయం ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు జగన్ మోహన్ రెడ్డి. తెలంగాణ సర్కార్ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం , ప్రత్యేక హోదా అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : Minister KTR : నిరుద్యోగులు సన్నాసులు – కేటీఆర్