Harish Rao : గజ్వేల్ – తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న వేళ రెండు చోట్ల సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని , తన మామ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇదిలా ఉండగా గజ్వేల్ లో మాజీ మంత్రి , హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు.
Harish Rao Slams Eatala Rejender
ఇక కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాలపై రాష్ట్ర ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎవరు గెలుస్తారనే దానిపై . ఇదిలా ఉండగా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎగిరే జెండా మాత్రం గులాబీదేనని స్పష్టం చేశారు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish Rao).
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆరు నూరైనా సరే తమ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఈటల రాజేందర్ ఎగిరెగిరి పడుతున్నారని ఇక ఆయన రాజకీయ ప్రస్థానం చివరి దశకు చేరుకుందన్నారు హరీశ్ రావు.
కేసీఆర్ ను ఢీకొనే సత్తా, దమ్మున్నోడు ఇంకా రాష్ట్రంలో పుట్టలేదన్నారు మంత్రి. డిసెంబర్ 9న మరోసారి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాబోతున్నామని జోష్యం చెప్పారు.
Also Read : CM KCR : కాంగ్రెస్ జమానా మోసానికి నమూనా