Harish Rao : ఆరు నూరైనా రుణ మాఫీ చేస్తాం
ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు
Harish Rao : హుస్నాబాద్ – ఆరు నూరైనా సరే రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish Rao). తాము అధికారంలోకి రాగానే సన్న బియ్యం అందజేస్తామన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం హుస్నాబాద్ లో జరిగిన ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు.
Harish Rao Commitment
అంతే కాకుండా పెన్షన్ ను రూ. 5 వేలకు పెంచుతామని చెప్పారు. రుణ మాఫీకి సంబంధించి కొంత ఆలస్యమైన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెబుతూ వస్తోందన్నారు.
తాము తీసుకు వచ్చిన మేని ఫెస్టోను ఆ పార్టీ కాపీ కొట్టిందంటూ ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వేలాది పోస్టులను భర్తీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. ఇవాళ కేంద్రం సైతం తమను చూసి నేర్చుకుంటోందన్నారు హరీశ్ రావు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కార్యక్రమాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. గత 50 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ది ఏమీ లేదన్నారు. అంతా నాశనమే తప్ప , ఆత్మహత్యలు తప్ప మిగిల్చింది ఏమీ లేదన్నారు.
Also Read : Nirmala Sitharaman : అప్పుల కుప్పగా మారిన తెలంగాణ