BRS Scams : బీఆర్ఎస్ స్కాంలు రూ. 4 లక్షల కోట్లు
కాంగ్రెస్ ఛార్జ్ షీట్ లో పూర్తి వివరాలు
BRS :హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ పోరు మరింత పెరిగింది. కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో బిగ్ ఫైట్ నెలకొంది. ఇందులో భాగంగా తాజాగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్(BRS) పాలనలో ఎన్ని స్కామ్ లు జరిగాయో ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఇందుకు సంబంధించి కేసీఆర్ సీఎంగా కొలువు తీరాక ఏకంగా 17 స్కామ్ లు (కుంభకోణాలు) జరిగాయని ఏకంగా రూ. 4 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడంటూ ఆరోపించింది.
BRS Scams Viral
మిషన్ భగీరథలో రూ. 21,000 కోట్లు , ఏఎంఆర్ కు తాటిచర్ల కోల్ బ్లాక్ , మైనింగ్ లీజుతో రూ. 16,000 కోట్లు , మిషన్ కాకతీయలో రూ. 12 వేల కోట్లు అవినీతి చోటు చేసుకుందని పేర్కొంది కాంగ్రెస్ పార్టీ. జీవో 111 రద్దుతో రూ. 1.40 కోట్లు , ధరణి పోర్టల్ తో రూ. 50 ,000 వేల కోట్లు , పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రూ. 25,000 కోట్లు, ఓఆర్ఆర్ టోల్ వసూళ్ల టెండర్లలో రూ. 22,630 కోట్ల స్కామ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేసింది.
తాము అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న 17 స్కామ్ లకు సంబంధించి విచారణ చేపడతామని ప్రకటించింది. ఆ వెంటనే దోషులను గుర్తించి వారిని జైలుకు పంపిస్తామని పేర్కొంది.
Also Read : KTR Slams : కోమటిరెడ్డి బ్రదర్స్ అవకాశవాదులు