Eatala Rajender : రాచరిక పాలనను సాగనంపాలి
పిలుపునిచ్చిన ఈటల రాజేందర్
Eatala Rajender : దుబ్బాక – రాష్ట్రంలో కొనసాగుతున్న రాచరిక పాలనను సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు మాజీ మంత్రి, హుజూరాబాద్ , గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ . ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో కమలం తరపున బరిలో నిలిచిన రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం చేపట్టారు.
Eatala Rajender Comments Viral
రాయపోల్ మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు ఈటల రాజేందర్(Eatala Rajender). కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. ప్రజల చెవుల్లో పూలు పెట్టి మోసం చేశాడని మండిపడ్డారు.
రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిశ్వాల్ కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. గజ్వేల్ లో ఓడి పోతాననే భయంతో కామారెడ్డికి పారి పోయాడని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా , వ్యూహాలు పన్నినా దుబ్బాకలో గెలిచేది పక్కా రఘునందన్ రావేనని జోష్యం చెప్పారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి ఓటమి ఖాయమన్నారు. కోడి కత్తి ప్లాన్ వర్కవుట్ కాదన్నారు ఈటల రాజేందర్.
Also Read : Pawan Kalyan : కమలం గెలుపు అభివృద్దికి మలుపు