Revanth Reddy : పొద్దస్తమానం చుక్క దిగందే నిద్రపోని సీఎం కేసీఆర్ కావాలా లేక ప్రజల కోసం నిత్యం పాటు పడే తనలాంటోడు సీఎం కావాలో తేల్చు కోవాలని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). కోడంగల్ లో తనపై లేనిపోని ఆరోపణలు చేసిన కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
Revanth Reddy Serious Comments on KCR
నాకు తాగుడు అలవాటు లేదు. కానీ సీఎం చుక్క తాగందే కాలు కదప లేడంటూ ఎద్దేవా చేశారు. పొద్దున లేస్తే ఎత్తుడు పోసుడే నీ పని అంటూ మండిపడ్డారు. ఇన్ని అవలక్షణాలు ఉన్న నీకు నాకు పోలికా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. కేసీఆర్ పనై పోయిందన్నారు. ఇక ఫామ్ హౌస్ కు పోవడం ఖాయమై పోయిందని జోష్యం చెప్పారు.
రాష్ట్రంలో వ్యవస్థలను అన్నింటిని నీర్వీర్యం చేశాడని ఆరోపించారు. ప్రభుత్వ భూములను అప్పనంగా దోచుకున్నది ఎవరో చెప్పాలన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, నిన్ను బొంద పెట్టడం ఖాయమని జోష్యం చెప్పారు.
రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నా ఒక్కటి కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు.
Also Read : Priyanka Gandhi : రేపే ప్రియాంక గాంధీ రాక