Eatala Rajender : దొర పాలన దోపిడీకి ఆలంబన
ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్
Eatala Rajender : కేసీఆర్ కు మొదటిసారిగా ఓడి పోతానేమోనని భయం పట్టుకుందని, అందుకే గజ్వేల్ నుంచి కామారెడ్డికి పారి పోయిండంటూ సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి, గజ్వేల్ , హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్(Eatala Rajender). ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గజ్వేల్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజల నుంచి వచ్చిన మద్దతను చూసి సంతోషానికి లోనయ్యారు. ఇవాళ ప్రజా వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉందని , కమలం పార్టీ నిర్ణయాత్మక పాత్ర పోషించడం ఖాయమని జోష్యం చెప్పారు.
Eatala Rajender Comments on KCR
అన్ని పార్టీలు బహుజనులను పక్కన పెట్టాయని కానీ బీజేపీ ఒక్కటే బీసీ వాదాన్ని నెత్తిన పెట్టుకుందన్నారు. బీసీకి చెందిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉండడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. అందుకే సాక్షాత్తు పీఎం బీసీని సీఎం చేస్తానని ప్రకటించారని ఇంతకంటే ఇంకేం కావాలన్నారు.
ఇవాళ మోదీని తిట్టే స్థాయి సీఎం కేసీఆర్ కు లేదన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకుడు తమ ప్రధానమంత్రి అని అన్నారు. కానీ తాను చెప్పిన మాటలను మరిచి పోయే రకం కేసీఆర్ నైజం అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు సీఎంను నమ్మే స్థితిలో లేరన్నారు. కేసీఆర్ పాలన పూర్తిగా దోపిడీకి ఆలంబనగా ఆరిందన్నారు ఈటల రాజేందర్.
Also Read : Revanth Reddy : తాగేటోనికి ఓటేస్తే తిప్పలే