Piyush Goyal : హైదరాబాద్ – తెలంగాణలో ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాదన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాన పార్టీలకు చుక్కలు చూపించడం ఖాయమని, తమ పార్టీ కీలకమైన పాత్ర పోషించ బోతోందన్నారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడటం ఖాయమని తామే కింగ్ పిన్ అవుతామన్నారు.
Piyush Goyal Comments on KCR
కేసీఆర్ కుటుంబ పాలనకు సమయం ముగిసిందన్నారు. ప్రతి దానికి కొంత సమయం అనేది ఉంటుందని, ఇప్పుడు ఇప్పుడు ఆ వంతు కేసీఆర్ కు వచ్చిందన్నారు. తను ఒక్కడే గొప్ప లీడర్ ను అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ దేశంలో మోదీని విమర్శించాలంటే దమ్ముండాలన్నారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు చుక్కలు చూపించేందుకు రెడీగా ఉన్నారని, వాళ్లు ఇప్పటికే బీజేపీని గెలిపించాలని డిసైడ్ అయ్యారని పేర్కొన్నారు పీయూష్ గోయల్(Piyush Goyal). కేసీఆర్ విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో అంతులేని అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. నాణ్యత లేకుండా నిర్మించారని ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని కేంద్ర జల శక్తి శాఖ ఆధ్వర్యంలోని టీమ్ ఇప్పటికే నివేదిక కూడా సమర్పించిందని గుర్తు చేశారు.
అవసరమైన సమయంలో తప్పక చర్యలు ఉంటాయని హెచ్చరించారు పీయూష్ గోయల్.
Also Read : Revanth Reddy Slams : కేసీఆర్ పనై పోయింది – రేవంత్ రెడ్డి