Vijaya Shanti : హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, ప్రముఖ నటి విజయ శాంతి షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలన పడకేసిందన్నారు. పూర్తిగా గతి తప్పిందన్నారు. ఇలాంటి సీఎంను ప్రజలు ఎన్నడూ కోరుకోలేదన్నారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిందని మండిపడ్డారు విజయశాంతి.
Vijaya Shanti Comment about BRS..BJP Relation
లక్షా 20 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా నీళ్ల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకని బీజేపీ చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు . ఆ ప్రాజెక్టు పూర్తిగా ఏటీఎంగా మారిందని పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చిన జేపీ నడ్డా, అమిత్ షా , మోదీ ఎందుకు ఈ ఎన్నికల సమయంలో మాట్లాడటం లేదంటూ ఫైర్ అయ్యారు.
పూర్తిగా కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టును నిర్మించారని, తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను, ఫ్యామిలీని భరించే స్థితిలో లేరన్నారు విజయశాంతి(Vijaya Shanti). దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అడ్డంగా బుక్కైన ఎందుకని కవితను అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. దీంతో ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని తేలి పోయిందన్నారు .
Also Read : Pawan Kalyan Slams : ధరణి విఫలం మార్పు అవసరం