Harish Rao : నా దెబ్బకు రేవంత్ ఓడి పోయిండు
ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
Harish Rao : సంగారెడ్డి – తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. దీంతో ప్రధానంగా కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరుకుంది. ప్రధానంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, కల్వకుంట్ల కవిత మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. బీజేపీ బరిలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనన్న ప్రచారం జోరందుకుంది. ఈ తరుణంలో తెలంగాణ దంగల్ లో కేవలం హస్తం, గులాబీ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటోంది.
Harish Rao Comments on Revanth Reddy
ఈ తరుణంలో గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి లో జరిగిన ప్రచార సభలో మంత్రి హరీశ్ రావు(Harish Rao) నిప్పులు చెరిగారు. మాట తప్పిన రేవంత్ రెడ్డికి తమ పార్టీని, తమ బాస్ కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
ఎవరు పని మంతులనేది ప్రజలకు స్పష్టంగా తెలుసన్నారు. రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు హరీశ్ రావు. ఆనాడు కోడంగల్ లో ఓడి పోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నాడని, తన దెబ్బకు పారి పోయిండంటూ ఎద్దేవా చేశారు.
Also Read : Vijaya Shanti : బీఆర్ఎస్..బీజేపీ ఒక్కటే