CM KCR : కంపెనీల కాన్ దాన్ తెలంగాణ
తెలంగాణ సీఎం కేసీఆర్
CM KCR : మహేశ్వరం – దేశంలోనే అత్యున్నతమైన కంపెనీలకు కేరాఫ్ గా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మారి పోయిందని అన్నారు సీఎం కేసీఆర్. ఈ ఘనత తాను తీసుకున్న నిర్ణయాల వల్లనే జరిగిందని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అందరికీ ఆమోద యోగ్యమైన ఇండస్ట్రీస్ పాలసీని తీసుకు వచ్చామని స్పష్టం చేశారు. దీని వల్ల పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ కంపెనీలు ఇక్కడ కంపెనీలు స్థాపించే ప్రయత్నం చేశారని తెలిపారు కేసీఆర్.
CM KCR Comment
గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలో ప్రస్తుత పార్టీ అభ్యర్థి , రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు కేసీఆర్(CM KCR). కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కొందరు సన్నాసులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అలాంటి వారికి విజన్ అంటూ ఏమీ లేదన్నారు.
అభివృద్ది అంటే తెలియని వాళ్లు తనపై , సర్కార్ పై రాళ్లు వేసే ప్రయత్నం చేస్తున్నారని వారికి అంత సీన్ లేదన్నారు. ఇవాళ ఒక్క తుక్కుగూడ ప్రాంతంలో ఏకంగా 52 కొత్త పరిశ్రమలు వచ్చాయని ఇంతకంటే ఇంకేం కావాలని ప్రశ్నించారు కేసీఆర్. రాబోయే కాలం చాలా విలువైనదని, తమ ఓటును పని చేసే వారికి వేయాలని సూచించారు.
Also Read : Harish Rao : నా దెబ్బకు రేవంత్ ఓడి పోయిండు