Minister KTR : హైదరాబాద్ – సోషల్ మీడియా దెబ్బకు సెలబ్రెటీలే కాదు పొలిటికల్ పార్టీలు , పేరు పొందిన రాజకీయ నాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ రాజకీయ వేడిని రాజేస్తున్నారు.
Minister KTR Comment
దీంతో ఒకరిపై మరొకరు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ మధ్యన ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అబద్దాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆయా పార్టీలు, నేతలు అప్రమత్తం అయ్యారు.
డీప్ ఫేక్ పేరుతో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసేందుకు ప్రతిపక్షాలు యత్నించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR). శుక్రవారం ట్వి్ట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈనెల 30న పోలింగ్ జరగనుందని, అప్పటి దాకా ప్రజలు ఫేక్ ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండేలా చూడాలని ఇందుకు సంబంధించి పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు చూడాలని స్పష్టం చేశారు కేటీఆర్. ఎన్నికల్లో ఓటమి అంచున ఉన్న కాంగ్రెస్ పార్టీ రానున్న నాలుగైదు రోజుల్లో అనేక ఫేడ్ వీడియోలు, వార్తలు ప్రచారం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Also Read : Divyavani : నటి దివ్యవాణికి కీలక పదవి