Vijayashanti : ప్రాజెక్టుల పేరుతో నిలువు దోపిడీ
కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి
Vijayashanti : తెలంగాణ – రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు నటి విజయశాంతి. పార్టీ క్యాంపెయిన్ లో భాగంగా జరిగిన సభలో ప్రసంగించారు. గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణను అడ్డం పెట్టుకుని అందినంత మేర దోచుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణవాదులను, ఉద్యమకారులను పక్కన పెట్టిన ఘనుడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు.
Vijayashanti Comments on BRS Party
లక్షా 20 వేల కోట్ల ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు గంగ పాలైందని ధ్వజమెత్తారు. పేపర్ లీకేజీలు, స్కామ్ లు, అవినీతి, అక్రమాలకు తెలంగాణను అడ్డాగా మార్చేశారంటూ ఫైర్ అయ్యారు విజయ శాంతి(Vijayashanti). దోచు కోవడం, దాచు కోవడం తప్ప కేసీఆర్ చేసింది ఏమీ లేదన్నారు.
దేశంలో ఎక్కడా లేనంతటి అవినీతి రాష్ట్రంలో చోటు చేసుకుందని ఇక జనం భరించే స్థితిలో లేరన్నారు.
ఇక నిత్యం ప్రాజెక్టుల్లో కరప్షన్ జరిగిందంటూ గగ్గోలు పెట్టే భారతీయ జనతా పార్టీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని ఆరోపించారు . వీరిని ప్రజలు నమ్మ వద్దని కోరారు. బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టేనని పేర్కొన్నారు.
Also Read : Abraham Join : అలంపూర్ ఎమ్మెల్యే జంప్