AP CID : బాబుపై సీఐడీ అఫిడవిట్ దాఖ‌లు

బెయిల్ ఇవ్వ‌ద్ద‌ని పిటిష‌న్ లో విన్న‌పం

AP CID : అమ‌రావ‌తి – ఏపీ టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు షాక్ త‌గిలింది. అమ‌రావ‌తి రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ స్కామ్ కు సంబంధించి ఏపీ సీఐడీ హైకోర్టును ఆశ్ర‌యించింది. ఈమేర‌కు ఇదే కేసు స్కామ్ కు సంబంధించి ఏకంగా 470 పేజీల‌తో కూడిన అడిష‌న‌ల్ అఫిడ‌విట్ ను దాఖ‌లు చేసింది.

AP CID Affidavit Raised

చంద్ర‌బాబుకు బెయిల్ ఇవ్వ‌వ‌ద్దంటూ అఫిడ‌విట్ లో కోరింది. పూర్తిగా ఎలా మోసానికి పాల్ప‌డ్డార‌నే దానిపై ఆధారాల‌తో స‌హా తాము ఇందులో పొందు ప‌ర్చిన‌ట్లు తెలిపింది ఏపీ సీఐడీ. కేవ‌లం త‌మ‌కు, త‌మ వారికి ల‌బ్ది చేకూర్చేందుకే చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu) త‌న సీఎం ప‌ద‌విని అడ్డం పెట్టుకుని రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ ప్లాన్ చేశార‌ని ఆరోపించింది.

మాస్ట‌ర్ ప్లాన్ లోనే డ‌బ్బులు చేతులు మారేలా రూపొందించారంటూ తెలిపింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చంద్ర‌బాబు నాయుడుకు బెయిల్ ఇవ్వ‌వ‌ద్దంటూ కోరింది ఏపీ సీఐడీ. ఇప్ప‌టికే ఏపీ స్కిల్ స్కామ్ కేసులో 53 రోజుల పాటు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో రిమాండ్ ఖైదీగా బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు.

త‌న కంటి శ‌స్త్ర చికిత్స కార‌ణంగా త‌న‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరారు. దీనిని స‌వాల్ చేస్తూ ప‌ర్మినెంట్ బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యించారు. పూర్తి విచార‌ణ చేప‌ట్టిన కోర్టు మంజూరు చేసింది. దీనిని స‌వాల్ చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

Also Read : BRS Meeting : బీఆర్ఎస్ స‌భ వాయిదా

Leave A Reply

Your Email Id will not be published!