Minister KTR : ప్ర‌తిపక్షాల‌ను జ‌నం న‌మ్మ‌రు

ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్

Minister KTR : హైద‌రాబాద్ – ప్ర‌తిప‌క్షాలు రాష్ట్రంలో జ‌రిగిన అభివృద్దిని చూసి ఓర్వ‌లేక పోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR). శుక్ర‌వారం ఆయ‌న హైద‌రాబాద్ లో జ‌రిగిన స‌మావేశంలో ప్ర‌సంగించారు. ఒక‌ప్పుడు ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ బ‌తుకు చిత్రం ఎంత దుర్భ‌రంగా ఉండిందో మ‌నంద‌రికీ తెలుస‌న్నారు.

Minister KTR Comment

ఆనాడు త‌న తండ్రి కేసీఆర్ చావు చివ‌రి అంచుల దాకా వెళ్లి పోరాటం చేసినందు వ‌ల్ల‌నే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింద‌న్నారు. ఇవాళ ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన నాయ‌కులు అప్పుడు ఎక్క‌డైనా ఉన్నారా అని నిల‌దీశారు. త‌మ‌కు అహంకారం ఉండ‌ద‌ని తెలంగాణ తీసుకు వ‌చ్చిన వాళ్లుగా అంత‌కు మించిన మ‌మ‌కారం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్.

చావు నోట్లో త‌ల పెట్టి తెలంగాణ కోసం కొట్లాడేంత ప్రేమ త‌మ‌కు ఉంద‌ని పేర్కొన్నారు మంత్రి. తెలంగాణ లో ప్ర‌తిప‌క్షాల‌కు త‌మ స‌ర్కార్ ను విమ‌ర్శించేందుకు ఏవీ దొర‌క‌డం లేద‌న్నారు. అందుకే త‌న‌ను, త‌న తండ్రిని, కుటుంబంపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసే నీచ స్థాయికి దిగ‌జారార‌ని ఆవేద‌న చెందారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌ని స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ‌లో స‌మ‌గ్ర‌, స‌మీకృత‌, స‌మ్మిళిత అభివృద్ది జ‌రిగింద‌ని చెప్పారు. ఇది వారికి క‌నిపించ‌ద‌ని ఎద్దేవా చేశారు మంత్రి.

Also Read : Chandra Babu Case : చంద్ర‌బాబు బెయిల్ విచార‌ణ వాయిదా

Leave A Reply

Your Email Id will not be published!