Revanth Reddy : మోసానికి చిరునామా కేసీఆర్ పాలన
టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి
Revanth Reddy : నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అన్నింటిని పక్కన పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. అన్ని వర్గాల ప్రజలను నిట్ట నిలువునా మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
Revanth Reddy Slams KCR
ఇవాళ రాష్ట్రంలో 2 లక్షలకు పైగా జాబ్స్ భర్తీ చేయకుండా ఎంతో మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. ఇవాళ జరగబోయే ఎన్నికలు ప్రజా తెలంగాణకు దొరల తెలంగాణకు జరుగుతున్న యుద్దంగా అభివర్ణించారు రేవంత్ రెడ్డి.
బీఆర్ఎస్ పార్టీకి అంత సీన్ లేదన్నారు. తమకు 119 సీట్లకు గాను కనీసం 80కి పైగా సీట్లు వస్తాయని లాల్ బహదూర్ స్టేడియంలో డిసెంబర్ 9న తమ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇలా ఎంకెంత కాలం మాయ మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తారంటూ ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి.
ప్రజలు డిసైడ్ అయ్యారని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Minister KTR : ప్రతిపక్షాలను జనం నమ్మరు