Bandi Sanjay Kumar : కేసీఆర్ పాలన అస్తవ్యస్తం
బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్
Bandi Sanjay Kumar : కరీంనగర్ – కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ విముక్తం కావాలంటే ఓటు అనే ఆయుధం తప్ప మరో మార్గం లేదన్నారు బీజేపీ జాతీయ నేత , బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ కుమార్ పటేల్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం కరీంనగర్ లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయనతో పాటు ఈటల రాజేందర్ ఏకంగా సీఎం పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పోటీలో ఉన్నారు.
Bandi Sanjay Kumar Comments on KCR Ruling
ఈ సందర్బంగా జరిగిన ప్రచారంలో నిప్పులు చెరిగారు బండి సంజయ్(Bandi Sanjay Kumar). కరీంనగర్ లో ఐటీ హబ్ నిర్మించారని ఏ ఒక్క కంపెనీ కూడా ఇక్కడికి రాలేదన్నారు. ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. విచిత్రం ఏమిటంటే తాను ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిత్యం ప్రస్తావిస్తూ , నిలదీస్తూ వస్తున్నానని చెప్పారు బండి సంజయ్ కుమార్ పటేల్.
ఏకంగా తన ఒక్కడిపైన 74 కేసులు పెట్టారంటూ ఆవేదన చెందారు. పేపర్ లీకేజీ వ్యవహారం కారణంగా వేలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారని, దీనికి పూర్తి బాధ్యత కేటీఆర్, సర్కార్ వహించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ గనుక గుండాగిరీ చేసేందుకు ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
Also Read : Priyanka Gandhi : దోపిడీకి చిరునామా తెలంగాణ