Minister KTR : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం పార్టీ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఊహించని రీతిలో కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా మారింది. దీంతో ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి.
Minister KTR in Metro
మొన్నటికి మొన్న కేటీఆర్ ఐటీ హబ్ వద్ద నిరుద్యోగులతో ములాఖత్ అయ్యారు. వారి బాధను, ఆవేదనను అర్థం చేసుకున్నారు. ఇక నుంచి జాబ్స్ భర్తీకి సంబంధించి దశల వారీగా నియమిస్తామని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో ఎల్బీ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఎల్బీ నగర్ నుంచి మెట్రోలో ప్రయాణం చేశారు. సామాన్య ప్రయాణికుడి లాగానే వారితో ముచ్చటించారు.
తాజాగా మంత్రి కేటీఆర్(Minister KTR) సైతం శుక్రవారం మెట్రోలో ఓ సామాన్యుడిలా ప్రయాణం చేశారు. అందరినీ ఆశ్చర్య పోయేలా చేశారు. తాను కూడా మీలాంటి వ్యక్తినేనంటూ ముచ్చటించారు. కేటీఆర్ స్వయంగా మెట్రోలో ప్రయాణం చేయడం, ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : Amit Shah : బీఆర్ఎస్ సర్కార్ బేకార్