Bandi Sanjay : కరీంనగర్ – బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్(Bandi Sanjay) నిప్పులు చెరిగారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో ఆయన కేటీఆర్ ను , బీఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేశారు. అన్నీ అబద్దాలు తప్ప చేసింది ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని ధ్వజమెత్తారు.
Bandi Sanjay Serious Comments
పదే పదే పేదరికం తగ్గిందని చెబుతూ వస్తున్న మంత్రి కేటీఆర్ కు సోయి లేకుండా పోయిందన్నారు. ఆయన చెబుతున్న దానికి చేసేందుకు చాలా వ్యత్యాసం ఉందని మండిపడ్డారు. ఆయన పలు ప్రశ్నలు కేటీఆర్ కు సంధించారు.
ఒకవేళ పేదరికం తగ్గితే తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా ఎలా మారిందని నిలదీశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ మిగులు బడ్జెట్ తో ఉందని, కానీ ఇవాళ రూ. 5 లక్షల కోట్లకు ఎలా చేరుకుందో చెప్పాలన్నారు. దీనికి పూర్తి బాధ్యత బీఆర్ఎస్ సర్కార్ అని ధ్వజమెత్తారు బండి సంజయ్.
దళిత బంధు, బీసీ బంధు, రైతు బంధు పథకాలు ఎందుకు ఇవ్వలేక పోయారో చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యోగులకు 15వ తేదీ వరకు ఎందుకు జీతాలు ఇవ్వడం లేదో కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.
Also Read : Harish Rao : కాంగ్రెస్ మోసం తెలంగాణకు శాపం