Revanth Reddy : బీఆర్ఎస్..బీజేపీతో కాదు ఈడీ..ఐటీతోనే పోటీ

టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి

Revanth Reddy : హైద‌రాబాద్ – రాష్ట్రంలో ఎలాగైనా స‌రే గెల‌వాల‌ని అడ్డ‌మైన అడ్డ‌దారులు తొక్కుతున్నారంటూ సీఎం కేసీఆర్ పై , బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇప్ప‌టికే తాము ఈసీకి ఫిర్యాదు కూడా చేశామ‌న్నారు. ఇవాళ రాష్ట్రంలో బీఆర్ఎస్ అన్ని రంగాల‌ను నిర్వీర్యం చేసింది. ఉన్న‌తాధికారులు స్వ‌చ్చందంగా విధులు నిర్వ‌హించాల్సి ఉండ‌గా అధికార పార్టీకి తొత్తులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆరోపించారు.

Revanth Reddy Comments Viral

రిటైర్డ్ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో జ‌రిపిన సోదాల గురించి ఎందుకు వివ‌రాలు బ‌య‌ట‌కు చెప్ప‌డం లేదంటూ ప్ర‌శ్‌నించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఒక్కో ఓటుకు రూ. 10 వేలు పంచాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని, ఆ దిశ‌గానే ఈ పంపిణీ వ్య‌వ‌హారం కొన‌సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఎన్ని వేలు పంపిణీ చేసినా, మాంసం, మ‌ద్యం ప్ర‌భావం చూపినా బీఆర్ఎస్ కు ఓట్లు వేసేందుకు జ‌నం ఆస‌క్తిని చూప‌డం లేద‌న్నారు రేవంత్ రెడ్డి. విచిత్రం ఏమిటంటే ఇంకా ఎన్నిక‌లు జ‌రిగేందుకు కొన్ని గంట‌ల స‌మ‌యం ఉంద‌ని, ఈ త‌రుణంలో ఎన్నిక‌ల సంఘం రైతు బంధు కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం దారుణ‌మ‌న్నారు. దీన్ని బ‌ట్టి చూస్తే బీఆర్ఎస్ , బీజేపీ రెండూ ఒక్క‌టేన‌ని తేలి పోయింద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్ర‌ధాన పోటీదారు బీఆర్ఎస్, బీజేపీ కాద‌న్నారు. కేవ‌లం ఐటీ, ఈడీ, సీబీఐ మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి.

Also Read : Amit Shah : బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అవినీతిమ‌యం

Leave A Reply

Your Email Id will not be published!