D Raja : విజయవాడ – నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా(D Raja). శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ జరుగుతున్న 5 రాష్ట్రాల శాసన సభ ఎన్నికలు కీలకం కానున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రభావం పూర్తిగా వ్యవస్థలపై పడిందని అన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగి పోతున్నా మోదీ పట్టించు కోవడం లేదంటూ ఆరోపించారు డి. రాజా.
D Raja Slams Modi
మణిపూర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ , తెలంగాణ, ఛత్తీస్ గఢ్ లలో జరిగే ఎన్నికలు అత్యంత కీలకమైనవని అందుకే యావత్ దేశం ఈ ఎన్నికల ఫలితాలపై ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయని చెప్పారు. దేశ వ్యాప్తంగా మోదీ వ్యతిరేకత పెచ్చరిల్లి పోయిందన్నారు. 10 ఏళ్ల కాలంలో మోదీ దేశానికి చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్కరు ఛీదరించు కుంటున్నారని అన్నారు.
ప్రస్తుతం దేశంలో మోదీ కారణంగా ప్రమాదంలో పడిందన్నారు. భారత రాజ్యాంగం , ప్రజాస్వామ్యం, లౌకికతత్వం అత్యంత ఇబ్బందుల్లో ఉందని ఆవేదన చెందారు డి. రాజా. ఇండియా కూటమి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బలమైన కూటమిగా ఉండ బోతోందని స్పష్టం చేశారు. మోడీ హయాంలో అదానీ ప్రపంచ కుబేరుడిగా ఎదిగాడని ఆరోపించారు.
Also Read : DK Shiva kumar : అధికారం ఖాయం గ్యారెంటీలు తథ్యం