Revanth Reddy : రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
ప్రజా ప్రతినిధులు కట్టు బానిసలు
Revanth Reddy : హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు మంగళం పాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టారని ఆరోపించారు. కట్టు బానిసల కంటే హీనంగా చూశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
Revanth Reddy Letter Viral
ఫిరాయింపులతో ఆత్మ గౌరవాన్ని, నిధులు ఇవ్వక , అప్పుల పాలు చేసి, ఆత్మహత్యలు చేసుకునేలా వారిని సర్వ నాశనం చేసిన ఘనుడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. వారిని రోడ్డు పాలు చేశాడని ధ్వజమెత్తారు. ఊరి అభివృద్ది కోసం తీసుకు వచ్చిన అప్పులు కట్టలేక చాలా మంది స్థానిక ప్రజా ప్రతినిధులు సూసైడ్ చేసుకున్నారని వారి గురించి కనీసం సానుభూతి కూడా తెలుప లేదంటూ ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి.
ఈ రాక్షస పాలన అంతమైతేనే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగి పోతాయని , కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు టీపీసీసీ చీఫ్. 30న జరిగే ఎన్నికల్లో తమ విలువైన ఓటును తమకు వేయాలని పిలుపునిచ్చారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలంగాణలో కేసీఆర్ పతనం ఖాయమని జోష్యం చెప్పారు రేవంత్ రెడ్డి. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
Also Read : Tiruvannamalai : తిరువణ్ణామలైలో దీపోత్సవం