Siddaramaiah : హైదరాబాద్ – సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య(Siddaramaiah). ఆదివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తాము ఇచ్చిన 5 గ్యారెంటీలను కర్ణాటకలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ చేసిన ఆరోపణలన్నీ అబద్దమని అన్నారు. దమ్ముంటే కర్ణాటకకు వస్తే నిరూపిస్తామని సవాల్ విసిరారు సీఎం.
Siddaramaiah Slams KCR Govt
తాము ఇచ్చిన హామీలను ఫస్ట్ కేబినెట్ లోనే ఆమోదించడం జరిగిందని చెప్పారు. తాము చెప్పినట్లుగానే 62 లక్షల మంది మహిళలు ప్రతి రోజూ ఉచితంగా ప్రయాణః చేస్తున్నారని తెలిపారు. తన భార్య కూడా ఉచితంగానే జర్నీ చేస్తోందన్నారు సిద్దరామయ్య.
హామీల అమలుతో కర్ణాటక మహిళలు ఆనందంగా ఉన్నారని అన్నారు. కన్నడ హామీలపై సీఎం కేసీఆర్ వి తప్పుడు ప్రచారాలేనని ఎద్దేవా చేశారు. తాము చెప్పేది నిజం..కానీ కేసీఆర్ చెప్పేదంతా పచ్చి అబద్దమన్నారు.
తాము ఇచ్చిన హామీలు అమలు అవుతున్నాయో లేదో ఇక్కడికి వచ్చి విచారణ చేపట్ట వచ్చని స్పష్టం చేశారు సిద్దరామయ్య. అన్న భాగ్య పథకం కింద 10 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. గృహ జ్యోతి పథకాన్ని జూలై లోనే మొదలు పెట్టామని తెలిపారు సీఎం.
Also Read : Nara Lokesh : రేపటి నుండి లోకేశ్ యాత్ర