PM Modi Visit : శ్రీనివాసుడిని దర్శించుకున్న పీఎం
PM Modi : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది శ్రీనివాసుడు, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి నేరుగా తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు.
PM Modi Visited Tirumala
అంతకు ముందు రేణిగుంట ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు ఏపీ గవర్నర్ నజీర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మా రెడ్డి, డిప్యూటీ సీఎం , మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ .
తిరుపతి నుండి నేరుగా తిరుమలకు చేరుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi). తిరుమలలో రాత్రి బస చేశారు. ఆయన రాకతో ఎక్కడ చూసినా పోలీసులు మోహరించారు. పీఎం రాకతో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో వైపు ఉద్రయం బ్రేక్ దర్శన సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ తిరుమలకు వేంచేశారు.
అక్కడ కొలువు తీరిన శ్రీ వేంకటేశ్వర స్వామి, అమ్మ వార్లను దర్శించుకున్నారు. అనంతరం తిరుమల ఆలయ పూజారులు, రుత్వికులు, వేద పండితులు మోదీకి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రసాద వితరణ చేశారు. ఆయనకు ఆశీస్సులు అందజేశారు. అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు బాగుండాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు.
Also Read : N Raghuveera Reddy : మార్పు ఖాయం కాంగ్రెస్ విజయం