Election Commission Shock : రైతు బంధు నిలిపి వేయాలి – ఈసీ
తెలంగాణ సర్కార్ కు ఆదేశం
Election Commission : న్యూఢిల్లీ – తెలంగాణలో ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఉన్నట్టుండి కోలుకోలేని షాక్ తగిలింది రాష్ట్రంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వానికి. కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. నిన్నటి దాకా రైతు బంధు పథకం కింద రైతులకు నిధులు జమ చేయొచ్చంటూ అనుమతి ఇచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఇది ఫక్తు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న విమర్శలు వచ్చాయి.
Election Commission Shocking Comment
సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం రైతు బంధు నిధుల విడుదలకు సంబంధించి ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission). ఇచ్చిన పర్మిషన్ ను ఉప సంహరించు కుంటున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రైతు బంధు పంపిణీని వెంటనే నిలిపి వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది ఎన్నికల కమిషన్. రెండు రోజుల కిందట రైతు బంధు నిధుల విడుదలకు అనుమతి ఇచ్చిన విషయం విదితమే. మొత్తంగా బీఆర్ఎస్ సర్కార్ కు ఇది కోలుకోలేని షాక్ అని చెప్పక తప్పదు.
ఇది పూర్తిగా ప్రజలను, ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని అభిప్రాయపడింది ఈసీ. ఇదిలా ఉండగా ఈనెల 28న రైతులకు రైతు బంధు పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభించింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
Also Read : Revanth Reddy : ఈసీ తీరుపై రేవంత్ గుస్సా