Bhatti Vikramarka : కేసీఆర్ నిర్వాకం రైతు బంధు ఆలస్యం
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : మధిర – రైతు బంధు నిలిపి వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంపై స్పందించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. సీఎం కేసీఆర్ నిర్వాకం కారణంగా రైతు బంధు ఆలస్యమైందని ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Bhatti Vikramarka Comments on KCR
రైతు బంధు ఇప్పుడు మొదలు పెట్టింది కాదన్నారు. నోటిఫికేషన్ వస్తే రైతు బంధు ఇవ్వడం కుదరదని మ ముందే కేసీఆర్ కు తెలుసన్నారు. ఒకవేళ నిధులు ఉంటే ఎందుకని పంపిణీ చేయలేక పోయారంటూ మండిపడ్డారు. ఇదంతా కావాలని చేసిన నాటకం తప్ప మరోటి కాదన్నారు బట్టి విక్రమార్క.
నోటిఫికేషన్ వచ్చేంత దాకా ఎందుకని ఆలస్యం చేశారో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ముందే నిధులను పంపిణీ చేసి ఉండి ఉంటే ఎంతో మేలు జరిగి ఉండేదన్నారు.
తాము రైతుల నిధులను ఆపాలని కోరలేదన్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే పంపిణీని నిలిపి వేయాలని సూచించామని తెలిపారు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేతకాక తమ పార్టీపై బురద చల్లితే ఎలా అని ప్రశ్నించారు. ఇకనైనా ప్రజలు, రైతులు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు సీఎల్పీ నేత.
Also Read : Harish Rao Slams : రైతు బంధుపై కాంగ్రెస్ కుట్ర