JP Nadda : సమర్థవంతమైన నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ప్రపంచంలో గుర్తింపు పొందారని అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda). తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పాల్గొని ప్రసంగించారు. మోదీ కృషి, ముందు చూపు వల్ల ఇవాళ అత్యంత వేగవంతంగా అభివృద్ది చెందుతున్న దేశంగా భారత దేశం నిలిచిందని దీనికి 140 కోట్ల భారతీయులు రుణపడి ఉండాలన్నారు జేపీ నడ్డా.
JP Nadda Praises Modi
గత 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలన్నారు. స్కామ్ లు, స్కీమ్ లు , అవినీతి, అక్రమాలకు అడ్డాగా దేశాన్ని తయారు చేసిందని ఆరోపించారు. అందుకే నేషనల్ హెరాల్డ్ కేసులో రూ. 600 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని గుర్తు చేశారు.
కర్ణాటకలో 5 గ్యారెంటీల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణలో సైతం ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసేందుకు ప్రచారం చేస్తున్నరాంటూ మండిపడ్డారు. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన ద్వారా దేశ వ్యాప్తంగా పేదలు ఇళ్లు నిర్మించుకున్నారని ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పాలన్నారు జేపీ నడ్డా.
తెలంగాణలో బీజేపీకి పక్కాగా 60 సీట్లకు పైగానే వస్తాయని తాము కింగ్ మేకర్స్ గా మార బోతున్నామని స్పష్టం చేశారు బీజేపీ చీఫ్. బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు ఒకే నాణేనికి రెండు వైపులా ఉన్నాయని ఆ రెండూ కుటుంబ పార్టీలేనంటూ ఎద్దేవా చేశారు.
Also Read : Congress Party Slams : కమలం..కారు ఒక్కటే – కాంగ్రెస్
