MLC Kavitha : రాహుల్ కామెంట్స్ కవిత సీరియస్
కాంగ్రెస్ రాష్ట్రాల్లో భర్తీ చేసిన జాబ్స్ ఎన్ని
MLC Kavitha : హైదరాబాద్ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత . కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు ఎన్ని జాబ్స్ ఇచ్చాయో ముందు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
MLC Kavitha Serious Comments on Rahul Gandhi
మంగళవారం కల్వకుంట్ల కవిత(MLC Kavitha) మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ పదే పదే అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలో 5 హామీల పేరుతో మోసం చేసి పవర్ లోకి వచ్చారని అన్నారు. ఇక ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణలో పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఇక్కడి ప్రజలు వారి మాటలను నమ్మరని స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వం లక్షా 65 వేలకు పైగా జాబ్స్ భర్తీ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఏటా 17 వేలకు పైగా జాబ్స్ ఇచ్చామని తెలిపారు కవిత. ఇందుకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలతో సహా వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు.
నిరుద్యోగంలో బీజేపీ పాలిత హర్యానా రాష్ట్రం నెంబర్ 1గా ఉందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ 2వ స్థానంలో నిలిచిందని మండిపడ్డారు. మధ్య ప్రదేశ్ లో బీజేపీ , కాంగ్రెస్ కేవలం 21 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చాయని ఆరోపించారు. కర్ణాటకలో 2 లక్షల 60 వేలు భర్తీ చేస్తామని చెప్పారని కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని ఎందుకో చెప్పాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు.
Also Read : BRS Win Again : సీఎన్డీపీ సర్వేలో గులాబీదే హవా