Sonia Gandhi : తెలంగాణ ప్ర‌జ‌లు మ‌న‌సున్నోళ్లు

సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ

Sonia Gandhi : న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ , సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని ఆమె రాష్ట్రంలోని నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జల‌ను ఉద్దేశించి వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. ఓటు అన్న‌ది అత్యంత కీల‌క‌మ‌ని, దానిని ప‌ని చేసే , అభివృద్ది చేసే అభ్య‌ర్థుల‌కు చూసి ఓటు వేయాల‌ని పిలుపునిచ్చారు.

Sonia Gandhi Viral

ఆనాడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి న‌ష్టం క‌లిగినా తాను వెనుదిరిగి చూడ లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని ఇది త‌న కుటుంబం త‌న‌కు ఇచ్చిన ఆస్తిగా సోనియా గాంధీ(Sonia Gandhi) అభివ‌ర్ణించారు.

ఏర్పాటైన కొత్త రాష్ట్రంలో కొలువు తీరిన పాల‌కులు కేవ‌లం త‌మ స్వార్థం కోసం మాత్ర‌మే ఆలోచించార‌ని ప్ర‌జ‌ల ఇబ్బందుల గురించి ప‌ట్టించు కోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా బాధ్య‌త‌తో మీ ముందుకు వ‌చ్చింద‌న్నారు .

ముంద‌స్తుగా మేనిఫెస్టోను ప్ర‌క‌టించ‌డం జ‌రిగింద‌ని, ఆరు గ్యారెంటీల‌ను త‌ప్ప‌క అమ‌లు చేసి తీరుతామ‌ని, ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో కొలువుతీరిన త‌మ స‌ర్కార్ 5 గ్యారెంటీల‌ను అమ‌లు చేస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు సోనియా గాంధీ. తెలంగాణ ప్ర‌జ‌లు మ‌న‌సున్నోళ్ల‌ని న‌వంబ‌ర్ 30న హ‌స్తానికి ఓటు వేసి ఆదరించాల‌ని ఆమె పిలుపునిచ్చారు.

Also Read : Rahul Gandhi : ఆటో డ్రైవ‌ర్ల‌కు కాంగ్రెస్ అండ

Leave A Reply

Your Email Id will not be published!