Lok Poll Survey : ఆ పార్టీకే గెలిచే ఛాన్స్
లోక్ పాల్ సర్వే
Lok Poll Survey : హైదరాబాద్ – దేశంలో లోక్ పోల్ సర్వే కీలక ప్రకటన చేసింది. బుధవారం ట్విట్టర్ వేదికగా రాష్ట్రంలో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో ముందస్తు ఫలితాలను వెల్లడించింది. ఊహించని రీతిలో కాంగ్రెస్(Congress) పార్టీ అధికారంలోకి రాబోతోందని ప్రకటించింది. ఏకంగా ఆ పార్టీకి 72 సీట్ల నుంచి 74 సీట్లు కైవసం చేసుకోబోతోందంటూ పేర్కొంది.
Lok Poll Survey Updates
ఇక ప్రస్తుతం అధికారంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి పార్టీకి 33 సీట్ల నుంచి 35 సీట్లు రాబోతున్నాయని వెల్లడించింది. ఎంఐఎం పార్టీకి 5 నుంచి 7 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని , భారతీయ జనతా పార్టీకి 2 నుంచి 4 సీట్లు వస్తాయని, ఇక స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి ఒకరు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.
ఇఇలా ఉండగా లోక్ పోల్ సంస్థ సర్వేను ఈనెల 22 నుండి 27 వరకు 12 వేల శాంపిల్స్ సేకరించినట్లు తెలిపింది . మొత్తంగా ఈసారి ఎన్నికలు నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 3న ఎన్నికలకు సంబంధించి ఫలితాలు రానున్నాయి.
ఇప్పటి వరకు వెల్లడైన సర్వేల సంస్థల ఫలితాలలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే పవర్ లోకి వస్తుందని పేర్కొన్నాయి.
Also Read : Congress Win : తెలంగాణలో హస్తం హవా