Telangana Governor : ఓటు వేయండి డెమోక్రసీని రక్షించండి
పిలుపునిచ్చిన గవర్నర్ తమిళి సై
Telangana Governor : హైదరాబాద్ – ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్(Telangana Governor) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఆయా పార్టీలు చేసే ప్రలోభాలకు లొంగ వద్దని సూచించారు. భారత రాజ్యాంగం ఇచ్చిన అరుదైన అవకాశం ఓటు హక్కు. దీనిని నిర్లక్ష్యం చేయవద్దని కోరారు.
Telangana Governor Message for Voters
రాష్ట్ర ప్రభుత్వం ఈసీ ఆదేశాల మేరకు నవంబర్ 30న పోలింగ్ డే ఉండడంతో సెలవు ప్రకటించిందని , ఇంటి వద్ద కూర్చోకుండా, ఎంజాయ్ చేయకుండా అత్యంత విలువైన ఓటును ఉపయోగించాలని స్పష్టం చేశారు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్.
పెద్ద ఎత్తున తరలి రావాలని, పోలింగ్ స్టేషన్లకు పోటెత్తాలని పిలుపునిచ్చారు. ఏమరుపాటుగా ఉండ వద్దని , ప్రజల కోసం పని చేసే అభ్యర్థులను ఎంచు కోవాలని, ఓటు వేయాలని గవర్నర్ కోరారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లా లంటే ఓటు వేయాలని అన్నారు.
పార్టీలు ముఖ్యం కాదని, కావాల్సిందల్లా చైతన్యవంతంతో కూడిన ఓటును గుర్తించాలని స్పష్టం చేశారు తమిళి సై సౌందర రాజన్. కనీసం 100 శాతం ఓటు పోల్ కావాలని ఆ దిశగా కదలాలని పేర్కొన్నారు.
Also Read : Sihmachalam : సింహాచలంలో వరుణ యాగం