Minister KTR : గులాబి గాలి వీస్తోంది – కేటీఆర్
మరోసారి అధికారంలోకి వస్తుంది
Minister KTR : హైదరాబాద్ – రాష్ట్రంలో ప్రజలు తమ వైపు ఉన్నారని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR). హైదరాబాద్ లోని బంజారాహిల్స్ నియోజకవర్గం నంది నగర్ పోలింగ్ కేంద్రంలో కేటీఆర్ తో పాటు భార్య సతీమణి కూడా ఓటు వేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 119 నియోజకవర్గాలలో కనీసం 85 సీట్లు వస్తాయని చెప్పారు.
Minister KTR Comment
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తాము ఎక్కడా రూల్స్ ను అతిక్రమించ లేదని స్పష్టం చేశారు. ముందుగానే పర్మిషన్ తీసుకుని తాను రక్తదానం చేశానని, ఈ విషయం తెలసు కోకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
కేవలం దుష్ప్రచారాన్ని మాత్రమే కాంగ్రెస్ నమ్ముకుందని, మేం అమలు చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేశామని, పని చేసినందుకే తాము ప్రజలను ఓటు వేయాలని కోరడం జరిగిందన్నారు మంత్రి కేటీఆర్.
జనం పూర్తిగా గులాబీ పార్టీ ద్వారానే తమకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారని, అందుకే తమకు గంప గుత్తగా బీఆర్ఎస్ కు ఓటు వేశారని చెప్పారు.
Also Read : Jagadish Reddy : నీటి విషయంలో రాజీ పడం