Vikas Raj CEO : ఇంకా పోలింగ్ శాతం పెరగాలి – సిఇవో
పిలుపునిచ్చిన వికాస్ రాజ్
Vikas Raj CEO : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్బంగా ఎన్నికల సరళి గురించి పూర్తి వివరాలు వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్య నిర్వహణ అధికారి వికాస్ రాజ్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Vikas Raj CEO Comment
చాలా చోట్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయని వాటిని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 20.07 శాతం రాష్ట్ర మంతటా పోలైందని అర్బన్ , రూరల్ ప్రాంతాల నుంచి ఓటర్లు భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు సిఇవో.
ఇప్పటి నుంచి ఓటింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నామని అన్నారు వికాస్ రాజ్(Vikas Raj CEO). రూరల్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరిగిందని , ఇక అర్బన్ ప్రాంతాలలో పెరగాల్సిన అవసరం ఉందన్నారు ఎలక్టోరల్ ఆఫీసర్.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో 119 సీట్లకు సంబంధించి పోలింగ్ జరుగుతోంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. ఇదే సమయంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.
Also Read : Komatireddy Venkat Reddy : ఓట్ల కోసం సాగర్ రాజకీయం