Bandi Sanjay : కరీంనగర్ – భారతీయ జనతా పార్టీ మాజీ చీఫ్ , కరీంనగర్ ఎంపీ , ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన బండి సంజయ్(Bandi Sanjay) కుమార్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన సభ ఎన్నికల సందర్భంగా గురువారం పోలింగ్ జరిగింది. తన విలువైన ఓటు వేశారు. తన కుటుంబంతో కలిసి ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు బండి.
Bandi Sanjay Words
ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లేక పోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోలేమన్నారు. రాష్ట్ర, కేంద్ర భవిష్యత్తుల గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత ఈ పార్టీకి దక్కుతుందన్నారు. కేవలం సుస్థిర పాలన తమ వల్లనే సాధ్యమవుతుందని, ప్రజలు ఇప్పటికే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకున్నారని చెప్పారు. ఓటు వజ్రాయుధమని దానిని కాపాడుకోక పోతే భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల దాకా జరుగుతుంది. ఇక సమస్యాత్మక ప్రాంతాలలో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది.
Also Read : Pawan Kalyan : ఓటు వేసిన పవన్ కళ్యాణ్