Telanagana Polling Day : బారులు తీరిన ఓటర్లు
119 నియోజకవర్గాలలో 40 శాతం
Telanagana Polling Day : తెలంగాణ – రాష్ట్ర వ్యాప్తంగా శాసన సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. భారీ ఎత్తున భద్రతా బలగాలు మోహరించారు. కొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మరికొన్ని చోట్ల పరస్పరం దాడులకు దిగారు. ఇక మధ్యాహ్నం వరకు కొంత మందకొడిగా సాగినా తర్వాత ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు.
Telanagana Polling Day Updates
ఇదిలా ఉండగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఎంత శాతం పోలింగ్ నమోదైందనే దానిపై వివరాలు ప్రకటిస్తూ వస్తోంది. తాజాగా చీఫ్ ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ పోలింగ్ పోల్ కు సంబంధించి వెల్లడించారు.
ఇక జిల్లాల వారీగా చూస్తే మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలో 46.89 శాతం, మహబూబ్ నగర్ జిల్లాలో 44.93 శాతం, మంచిర్యాల జిల్లాలో 42.74 శాతం, మెదక్ జిల్లాలో 50.80 శాతం, మేడ్చల్ జిల్లాలో 26.70 శాతం, ములుగు జిల్లాలో 45.69 శాతం నమోదైనట్లు తెలిపారు.
ఇక నాగర్ కర్నూల్ జిల్లాలో 39.58 శాతం, నల్గొండ జిల్లాలో 39.20 శాతం, నారాయణపేట జిల్లాలో 42.60 శాతం, నిర్మల్ జిల్లాలో 41.74 శాతం, నిజామాబాద్ జిల్లాలో 39.66 శాతం, పెద్దపల్లి జిల్లాలో 44.49 శాతం, సిరిసిల్ల జిల్లాలో 39.07శాతం, రంగారెడ్డి జిల్లాలో 29.79శాతం, సంగారెడ్డి లో 42.17 శాతం, సిద్దిపేట లో 44.35 శాతం, సూర్యాపేట లో 44.14 శాతం, వికారాబాద్ లో 44.85 శాతం, వనపర్తి జిల్లాలో 40.40 శాతం, వరంగల్ జిల్లాలో 37.25 శాతం, యాదద్రిలో 45.07శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించారు.
Also Read : Harish Rao : అభివృద్ధి వైపు జనం చూపు