Minister KTR : ఎగ్జిట్ పోల్స్ ఫేక్ బీఆర్ఎస్ షేక్

ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్

Minister KTR : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో ఎన్నిక‌లు ముగిశాయి. పోలింగ్ కు ఈనెల 3న ఫ‌లితాలు రానున్నాయి. మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ సంద‌ర్భంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఇటు తెలంగాణ‌, అటు దేశంలోని ప్ర‌ధాన న్యూస్ ఛాన‌ళ్లు, స‌ర్వే సంస్థ‌ల‌న్నీ గంప గుత్త‌గా రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుంద‌ని ప్ర‌క‌టించాయి. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్.

Minister KTR Comment

శుక్ర‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఫ‌లితాలు పూర్తిగా త‌ప్పు అని పేర్కొన్నారు. అవ‌న్నీ ఫేక్ స‌ర్వేల‌ని, కాంగ్రెస్ పార్టీ కావాల‌ని దుష్ప్ర‌చారం చేస్తోంద‌ని మండిప‌డ్డారు మంత్రి.

త‌మ పార్టీకి క‌నీసం 80కి పైగా సీట్లు రావ‌డం ప‌క్కా అని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌ని పేర్కొన్నారు కేటీఆర్(Minister KTR). ఆరు నూరైనా బీఆర్ఎస్ గెలుపు ప‌క్కా అని జోష్యం చెప్పారు. తమ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాలు , కార్య‌క్ర‌మాలు దేశంలో ఎక్క‌డా అమ‌లు చేయ‌డం లేద‌న్నారు కేటీఆర్.

తాము అమ‌లు చేసిన ప‌థ‌కాల‌ను దేశం అనుస‌రిస్తోంద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా ఈనెల 4న సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న కేబినెట్ మీటింగ్ కాబోతోంద‌ని స్ప‌ష్టం చేశారు. విజ‌యంలో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు కేటీఆర్.

Also Read : CM KCR : 4న కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న మీటింగ్

Leave A Reply

Your Email Id will not be published!