Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.75 కోట్లు
స్వామి వారిని దర్శించుకున్న భక్తులు 56,950
Tirumala Hundi : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించు కునేందుకు భక్తులు పోటెత్తారు. 56 వేల 950 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
Tirumala Hundi Updates
20 వేల 463 మంది భక్తులు తల నీలాలు సమర్పించుకున్నారు. స్వామి వారికి నిత్యం భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.75 కోట్లు వచ్చాయని వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (TTD).
ఇదిలా ఉండగా సుదూర తీరాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తిరుమలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, కార్య నిర్వహణ అధికారి (ఈవో) ఏవీ ధర్మా రెడ్డి.
ప్రస్తుతం డైరెక్టు లైన్ వరకు భక్తుల లైన్ నిలిచి ఉంది. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 8 గంటలకు పైగా దర్శన సమయం పడుతుందని స్పష్టం చేశారు ఏవీ.
Also Read : Revanth Reddy Slams : ప్రభుత్వ నిధులు మళ్లించే ఛాన్స్