Kodandaram : ప్ర‌జా తీర్పు సుస్ప‌ష్టం – కోదండ‌రాం

టీజేఎస్ చీఫ్ షాకింగ్ కామెంట్స్

Kodandaram : హైద‌రాబాద్ – తెలంగాణ జ‌న స‌మితి పార్టీ చీఫ్ కోదండ‌రాం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జా తీర్పు సుష్పష్టంగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌ల స‌ర‌ళిపై ప్ర‌క‌టించిన ఎగ్జిట్ పోల్స్ పై స్పందించారు. ఈ మేర‌కు ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపార‌ని అన్నారు.

Kodandaram Comment

ఎన్నిక‌ల సంద‌ర్భంగా తాను బ‌స్సు యాత్ర చేప‌ట్టాన‌ని ప్ర‌తి చోటా జ‌నం ఆద‌రించార‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమాన ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

అధికారంలో 10 ఏళ్ల పాటు రాక్ష‌స‌, దోపిడీ పాల‌న సాగించిన న‌యా నిజాం న‌వాబు కేసీఆర్ ను సాగ‌నంప బోతున్నార‌ని జోష్యం చెప్పారు కోదండ‌రాం(Kodandaram). ప్ర‌జ‌లు ఇక ఎంత మాత్రం పాల‌కుల‌ను స‌హించే స్థితిలో లేర‌న్నారు.

పాల‌కుల ద‌మ‌నకాండ‌, దోపిడీ, అక్ర‌మాల‌కు అడ్డు అదుపు లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు టీజేఎస్ చీఫ్‌. 119 నియోజ‌క‌వ‌ర్గాలలో తీర్పు సుస్ప‌ష్ట‌మైంద‌ని దీనిని అడ్డుకోవ‌డం బీఆర్ఎస్ బాస్ , ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు సాధ్యం కాద‌ని పేర్కొన్నారు కోదండ‌రాం.

యావ‌త్ దేశం మొత్తం డిసెంబ‌ర్ 3న జ‌నం తీర్పు వెలువ‌రించ బోతున్నార‌ని , ఇక దొర ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి వెళ్లి పోవ‌డం ఖాయ‌మ‌ని తేలి పోయింద‌న్నారు. కేవ‌లం మెజారిటీ ఎంత వ‌స్తుంద‌నేది మాత్ర‌మే వేచి చూడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

Also Read : Tirumala Hundi : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.75 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!