Madhu Yashki Goud : కల్వకుంట్ల దొంగలను వదిలి పెట్టం
కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్
Madhu Yashki Goud : హైదరాబాద్ – అధికారాన్ని అడ్డం పెట్టుకుని లెక్కకు మించి ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కి గౌడ్(Madhu Yashki Goud). శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎంపై సంచలన ఆరోపణలు చేశారు.
Madhu Yashki Goud Serious Comments
ప్రగతి భవన్ లో దాచి పెట్టిన వందల కోట్ల రూపాయలను దొంగతనంగా తన ఫామ్ హౌస్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పనై పోయిందని స్పష్టం చేశారు. 119 సీట్లకు గాను తమ పార్టీకి 80 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
వచ్చేది తమ ప్రభుత్వమేనని, కేసీఆర్ కు ,ఆయన పరివారానికి సహకరించే సీనియర్ ఆఫీసర్లను వదిలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. తాము వచ్చాక విచారణ చేపడతామని, ఎక్కడ ఉన్నా తీసుకు వచ్చి లోపల వేస్తామని అన్నారు మధు యాష్కి గౌడ్.
ఇప్పటికే దోచుకున్నది చాలక మిగిలిన డబ్బులను దొంగతనంగా ఫామ్ హౌస్ కు ఎలా తరలించుకు పోతాడంటూ ప్రశ్నించారు .
Also Read : YS Sharmila : కేసీఆర్ కు సూట్ కేస్ గిఫ్ట్