Minister KTR : తెలంగాణలో హ్యాట్రిక్ పక్కా – కేటీఆర్
బీఆర్ఎస్ కు 80 సీట్లు వస్తాయి
Minister KTR : హైదరాబాద్ – ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది ఓట్ల లెక్కింపునకు సంబంధించి శనివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బలుపు చూసుకుని వాపు అనుకుంటోందని ఎద్దేవా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు.
Minister KTR Comment
తమకు 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో కనీసం 80కి పైగా సీట్లు వస్తాయని అన్నారు కేటీఆర్(Minister KTR). దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణ సర్కార్ అమలు చేస్తోందన్నారు. ఇంతకు మించి ఇంకేం కావాలన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు మంత్రి.
కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావంటూ సెటైర్ వేశారు. తమకు అందిన సమాచారం మేరకు కనీసం 90 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తాను ఇప్పుడే సీఎం అయి పోయినట్లు ఫీల్ అవుతున్నాడని అంత సీన్ లేదన్నారు.
ఏది ఏమైనా తాము మౌనంగా ఏమీ లేమన్నాడు. అందుకే తమ పార్టీ బాస్ , సీఎం కేసీఆర్ అధ్యక్షతన 4న కీలక మీటింగ్ పెట్టామని , తాము మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని స్పష్టం చేశారు కేటీఆర్.
Also Read : KA Paul : వికాస్ రాజ్ పై సీజేఐకి ఫిర్యాదు