Chandra Babu Naidu : జనమే నా బలం బలగం
నారా చంద్రబాబు నాయుడు
Chandra Babu Naidu : విజయవాడ – పలు కేసుల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్ పై ఉన్న టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటిస్తున్నారు. సతీ సమేతంగా తిరుమలకు వెళ్లారు. అక్కడ స్వామి, అమ్మ వార్లను దర్శించుకున్నారు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా , ఎన్ని కుట్రలు చేసినా తనను అడ్డుకోలేరని పేర్కొన్నారు.
Chandra Babu Naidu Comments Viral
శనివారం విజయవాడకు చేరుకున్నారు. కనక దుర్గమ్మను దర్శించుకున్నారు చంద్రబాబు(Chandra Babu Naidu), నారా భువనేశ్వరి. బాబు దంపతులకు అర్చకులు ఆశీర్వదించారు. అనంతరం అమ్మ వారికి సంబంధించి ప్రసాదం, ఫోటోను అందజేశారు.
ఆదివారం చంద్రబాబు నాయుడు సింహాచలంలోని అప్పన్న స్వామిని దర్శించు కోనున్నారు. డిసెంబర్ 5న శ్రీశైలానికి చేరుకుంటారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పేరు పొందిన కడప లోని అమీన్ పీర్ దర్గాను, గుణదల లోని చర్చికి చేరుకుని దర్శించుకుంటారని టీడీపీ వెల్లడించింది.
ఇదిలా ఉండగా దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు బాబు. జనమే తనకు బలం, బలగమని స్పష్టం చేశారు. ఈనెల 10 నుంచి జిల్లాలలో పర్యటిస్తానని చెప్పారు.
Also Read : Revanth Reddy CEO : సీఈవోకు సీఎంపై ఫిర్యాదు