Vijaya Shanti : హైదరాబాద్ – తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. పదేళ్లుగా రాక్షస పాలన కొనసాగుతోందని ఇక దానికి మూడిందన్నారు. కారు పంక్చర్ అవడం ఖాయమని జోష్యం చెప్పారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
Vijaya Shanti Comments on BRS
ప్రజలు సుస్పష్టమైన తీర్పు ఇవ్వ బోతున్నారని , తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు హస్తాన్ని ఆదరించారని , ఇది నాలుగున్నర కోట్ల మంది ప్రజలు చూశారని స్పష్టం చేశారు విజయశాంతి(Vijaya Shanti). సీఎం కేసీఆర్ పనై పోయిందన్నారు. 119 నియోజకవర్గాలకు సంబంధించి 80కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ఎవరు దొరలో ఎవరు దొంగలో తేలి పోయిందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఇక పెట్టే బేడా కల్వకుంట్ల కుటుంబం సర్దుకోవాల్సిందేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ , బీజేపీ , ఎంఐఎం ఒక్కటేనని తేలి పోనుందని స్పష్టం చేశారు.
ఇక డిసెంబర్ 3 తెలంగాణ చరిత్రలో ప్రత్యేకంగా గుర్తిండి పోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు తప్పక అమలు చేయడం జరుగుతుందని ప్రకటించారు. ఈ నమ్మకం తనకు ఉందన్నారు.
Also Read : Nara Lokesh : ఏపీలో వచ్చేది మేమే – లోకేష్